పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష తేదీ మార్పు
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:10 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేశారు. వచ్చేనెల 16 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు...
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేశారు. వచ్చేనెల 16 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లీష్ పరీక్షను మార్చి 20న నిర్వహించాల్సి ఉండగా, ఆ రోజు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆ పరీక్షను మార్చి 21న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి శనివారం తెలిపారు. మిగిలిన అన్ని పరీక్షలూ ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయన్నారు.