Electricity Amendment Bill: నూతన విద్యుత్ సవరణ బిల్లుపై ఇక యుద్ధమే
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:37 AM
దేశంలో కార్పొరేట్లకు లబ్ధి కలిగించేలా రూపొందించిన కొత్త విద్యుత్ సవరణ బిల్లుపై యుద్ధం చేయనున్నట్టు సీఐటీయూ అఖిలభారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ తెలిపారు.
సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో కార్పొరేట్లకు లబ్ధి కలిగించేలా రూపొందించిన కొత్త విద్యుత్ సవరణ బిల్లుపై యుద్ధం చేయనున్నట్టు సీఐటీయూ అఖిలభారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ తెలిపారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న 18వ అఖిల భారత సీఐటీయూ మహాసభలకు హాజరైన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కారణంగా ప్రజల జీవనం ప్రమాదంలో పడిందన్నారు. కొత్త విద్యుత్ సవరణ బిల్లు, లేబర్ కోడ్‌లు, ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచడం వంటి చర్యలకు కేంద్రం పాల్పడుతోందన్నారు. దీనిపై ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో త్వరలోనే క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ప్రా రంభించబోతున్నామని తెలిపారు. దేశరక్షణ, ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు వచ్చే నెల 12న సార్వత్రిక సమ్మెతో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. విశాఖలో జరుగుతున్న మహాసభల్లో ఉద్య మ కార్యాచరణపై రాష్ట్రాల వారీగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖ ఉక్కుపై మహాసభల్లో చర్చ జరిగిందన్నారు. ముడిసరుకు ఇవ్వకుండా, ఉత్పత్తిని పూర్తిస్థాయిలో జరగనివ్వకుండా బీజేపీ కుట్ర పన్నుతోందని తపన్‌సేన్ ఆరోపించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పాల్గొన్నారు.