Share News

Civil Rights Association: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:47 AM

మావోయిస్టు పార్టీతో ప్రభుత్వం బేషరతుగా శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది.

Civil Rights Association: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

  • తిరుపతిలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల తీర్మానం

తిరుపతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీతో ప్రభుత్వం బేషరతుగా శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగిన మహాసభల్లో చేసిన 16 తీర్మానాలను ఆదివారం సంఘం ప్రతినిధులు విడుదల చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసుల జీవించే హక్కును హరిస్తున్న ఆపరేషన్‌ కగార్‌ను, అన్ని మిలటరీ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పౌరహక్కుల సంఘం తీర్మానం చేసింది. పౌరహక్కుల సంఘం నేత క్రాంతి చైతన్యతో పాటు ఆరుగురిపై మోపిన అక్రమ దేశద్రోహ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేసింది. కాగా, పౌరహక్కుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వేడంగి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శిగా చిలుకా చంద్రశేఖర్‌ తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె.క్రాంతి చైతన్య, ఎన్‌. శ్రీమన్నారాయణ, ఎల్లంకి వెంకటేశ్వర్లుతోపాటు.. ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Updated Date - Jan 12 , 2026 | 06:47 AM