మొక్కు చెల్లించుకున్న బండ్ల గణేశ్
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:25 AM
సినీ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమలలో తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును జైలుకు పంపించినప్పుడు...
23 రోజులు పాదయాత్ర చేసి తిరుమలకు
తిరుమల, ఫిబ్రవరి11(ఆంధ్రజ్యోతి): సినీ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమలలో తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును జైలుకు పంపించినప్పుడు ఆయన సురక్షితంగా బయటకు వస్తే కాలినడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్న బండ్ల గణేశ్ హైదరాబాద్ నుంచి 23 రోజుల పాటు పాదయాత్ర చేసి మంగళవారం కొండకు చేరుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.