అన్ని వర్గాలకూ ఆశాజనకం: సీఐఐ చైర్మన్
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:16 AM
కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకూ ఆశాజనకంగా ఉందని సీఐఐ వైస్ చైర్మన్ ఎస్.నరేంద్రకుమార్ అభిప్రాయపడ్డారు.
విజయవాడ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకూ ఆశాజనకంగా ఉందని సీఐఐ వైస్ చైర్మన్ ఎస్.నరేంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వం అన్ని రంగాలకూ ప్రాధాన్యమిస్తూ సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. లార్జ్‌స్కేల్ మాన్యుఫ్యాక్చరింగ్, స్కిల్ డెవల్‌పమెంట్‌పై దృష్టిపెట్టడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. సీఐఐ విజయవాడ జోన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమం ద్వారా మహిళలను స్వయం ఉపాధి వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం గొప్ప పరిణామమని పేర్కొన్నారు.