సీడాప్‌కు స్కోచ్ అవార్డు
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:15 AM
సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెంట్ ఇన్ ఏపీ(సీడాప్)కు స్కోచ్ సిల్వర్ అవార్డు(రజత పతకం) లభించింది.
డీడీయూ-జీకేవై సమర్థ అమలుకు రజత పతకం
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెంట్ ఇన్ ఏపీ(సీడాప్)కు స్కోచ్ సిల్వర్ అవార్డు(రజత పతకం) లభించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన(డీడీయూ-జీకేవై) ప్రాజెక్టును సమర్థవంతంగా అమలుచేసినందుకుగాను ఈ అవార్డు దక్కింది. సీడాప్ సీఈవో నారాయణస్వామి శనివారం ఢిల్లీలో ఈ అవార్డు తీసుకున్నారు. స్కోచ్ ఫౌండేషన్ అధ్యక్షుడు సమీర్ కొచ్చర్ అవార్డు అందజేశారు. డీడీయూ జీకేవై ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ యువతకు పలు రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2025-26లో రాష్ట్రం లో 21,587 మందికి శిక్షణ ఇవ్వగా 11,210 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. శిక్షణ కేంద్రాలను సీసీ టీవీల ద్వారా పర్యవేక్షించడం, ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా యాప్ ఆధారిత వెరిఫికేషన్ లాంటి విధానాల అమలును గుర్తించిన స్కోచ్ సంస్థ సిల్వర్ అవార్డును ఇచ్చింది.