Share News

ఐఆర్‌ఆర్‌ కేసులో ఆళ్లకు సీఐడీ నోటీసు

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:55 AM

అమరావతిలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు(ఐఆర్‌ఆర్‌) కేసులో సీఐడీ అధికారులు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి గురువారం నోటీసు జారీ చేశారు.

ఐఆర్‌ఆర్‌ కేసులో ఆళ్లకు సీఐడీ నోటీసు

ఇంటర్నెట్ డెస్క్: అమరావతిలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు(ఐఆర్‌ఆర్‌) కేసులో సీఐడీ అధికారులు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి గురువారం నోటీసు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫిర్యాదుతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. హెరిటేజ్‌ సంస్థకు సంబంధించిన భూముల కోసం ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసుపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసును మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌(వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం)గా పరిగణించి మూసివేస్తామని, దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టుకు తెలపాలంటూ దర్యాప్తు సంస్థ అధికారులు ఆళ్లకు నోటీసు ఇచ్చారు.

Updated Date - Feb 20 , 2026 | 05:55 AM