రీల్స్ చూస్తూ విధుల్లో నిర్లక్ష్యం
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:04 AM
చిత్తూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడిపై ఓ రైల్వే ఉద్యోగిని దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఆమెను రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ప్రశ్నించిన ప్రయాణికుడిపై రైల్వే ఉద్యోగిని దాడి, సస్పెన్షన్
చిత్తూరు రూరల్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడిపై ఓ రైల్వే ఉద్యోగిని దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఆమెను రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 14న గుడివాడకు టికెట్ బుకింగ్ చేసుకునేందుకు చిత్తూరు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో బుకింగ్‌లోని ఉద్యోగిని సెల్‌ఫోన్‌లో రీల్స్ చూస్తూ ప్రయాణికులను పట్టించుకోలేదు. అరగంటకుపైగా వేచి చూసిన ఆ ప్రయాణికుడు ఆమెను ప్రశ్నించారు. దీంతో దురుసుగా ప్రవర్తించిన ఆ మహిళా ఉద్యోగి.. ప్రయాణికుడిని దుర్భాషలాడుతూ దాడి చేసింది. ఈ ఘటనపై ఆ ప్రయాణికుడు జీఆర్‌పీఎ్‌ఫకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పందించిన రైల్వే అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.