Share News

చింతాడకు జగన్‌ ‘న్యాయ’ భరోసా

ABN , Publish Date - Aug 21 , 2026 | 03:49 AM

మదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవి కుమార్‌ను అన్ని విధాలా ఆదుకుంటానని, న్యాయపరంగా పూర్తి సహకారం అందించి అండగా..

చింతాడకు జగన్‌ ‘న్యాయ’ భరోసా

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవి కుమార్‌ను అన్ని విధాలా ఆదుకుంటానని, న్యాయపరంగా పూర్తి సహకారం అందించి అండగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ఇటీవల జగన్‌ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన సందర్భంలో మహిళా పోలీసు అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయంలో చింతాడపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై విడుదలైన చింతాడ రవికుమార్‌ గురువారం తాడేపల్లి నివాసంలో జగన్‌ను కలిశారు. చింతాడ చెప్పింది విన్న జగన్‌ రాజకీయంగానూ, న్యాయపరంగానూ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Aug 21 , 2026 | 03:50 AM