యాదవ జాతి ఐక్యత, అభివృద్ధికి కృషిచేస్తా
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:19 AM
గ్రామగ్రామాన యాదవ సంఘ నిర్మాణం చేపట్టి యాదవ జాతి ఐక్యత, అభివృద్ధి, సంక్షేమానికి తోడ్పడతానని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ యాదవ్ తెలిపారు.
అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు చింకా నారాయణ
విజయవాడ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): గ్రామగ్రామాన యాదవ సంఘ నిర్మాణం చేపట్టి యాదవ జాతి ఐక్యత, అభివృద్ధి, సంక్షేమానికి తోడ్పడతానని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ యాదవ్ తెలిపారు. విజయవాడ నగర శివారు కానూరులో రాష్ట్ర యాదవ కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. నారాయణ యాదవ్ మాట్లాడుతూ, పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, యాదవులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సంఘం పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. యాదవ జాతికి అవసరమైన యాదవ భవన్ నిర్మాణం, యాదవ హాస్టల్ కోసం ప్రభుత్వంలోని యాదవ పెద్దలను కలిసి ప్రయత్నిస్తానని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి అఖిల భారత యాదవ మహాసభను బలోపేతం చేస్తామన్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ రాష్ట్ర కమిటీ యూత్ అధ్యక్షుడు ఆలా అనంతరామయ్య యాదవ్, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ కొలుసు మోహన్ యాదవ్, జనరల్ సెక్రటరీలు ఎద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్, యర్రాకుల శ్రీనివాస యాదవ్, బొడ్డు పైడిరాజు యాదవ్, వైస్ ప్రెసిడెంట్‌లు జేవీ కృష్ణయ్య యాదవ్, అల్లు వెంకట రమణారావు యాదవ్, తోలక రామకృష్ణ యాదవ్‌కు రాష్ట్ర యాదవ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు అభినందనలు తెలిపారు.