చైన స్నాచర్ అరెస్టు
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:43 PM
కర్నూలు మూడో పట్టణ పోలీసులు చైన స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శేషయ్య తెలిపారు.
కర్నూలు క్రైం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మూడో పట్టణ పోలీసులు చైన స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శేషయ్య తెలిపారు. వివరాలు.. ఈ నెల 10వ తేదీన బి.క్యాంపు హౌసింగ్ బోర్డు కాలనీలో తన ఇంటి అరుగు ముందు కూర్చుని శ్యామలమ్మ అనే మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి బం గారు గొలుసు దొంగిలించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బైక్ నెంబర్‌ను గుర్తించి నిందితుడు చాకలి ప్రవీణ్‌గా గుర్తించారు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాలదిన్నెకి చెందిన చాకలి ప్రవీణ్ కర్నూలు సంతోష్‌నగర్‌లో ఫాస్ట్‌పుడ్ సెంటర్ పెట్టి అందులో నష్టం వచ్చి ఎత్తివేశాడు. ఆ తర్వాత మిత్రుడు మధు సూదనతో కలిసి హోటల్ వ్యాపారం నిర్వహించి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేం దుకు చైన స్నాచింగ్, దొంగతనాలు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఓ తమిళ సినిమాలో చైన స్నాచింగ్‌లు చేయడం చూసి ఇది అయితే సులభంగా ఉంటుందని భావించాడు. తన బైక్‌పై ఓవారం రోజుల పాటు అన్ని సందుల్లో తిరిగాడు. ఎక్కడా కూడా అవకాశం రాలేదు. ఈనెల 10న బి.క్యాంపు హౌసింగ్ బోర్డు కాలనీలో వెళ్తుండగా శ్యామలమ్మ అనే మహిళను గుర్తించాడు. ఆమె మెడలోని గొలుసును తెంపుకుని పరారయ్యాడు. పోలీసులు నిందితుని పట్టుకుని రిమాండ్‌కు పంపారు. నిందితుని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఎస్ ఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్‌రెడ్డి, బాల నరసింహులు, హెడ్ కానిస్టేబుల్ చెంచన్న, సుం కన్న కానిస్టేబుల్ సంతోష్, తిరుమలేష్, నాయక్, శ్రీనివాసులును సీఐ అభినందించారు.