పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:42 PM
అంగనవాడీ కొ చ్చే పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఐసీడీఎస్ పీడీ విజయ ఆదేశించారు.
ఐసీడీఎస్ పీడీ విజయ
ఆదోని రూరల్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : అంగనవాడీ కొ చ్చే పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఐసీడీఎస్ పీడీ విజయ ఆదేశించారు. శుక్రవారం సీడీపీవో ఢిల్లీశ్వరితో కలిసి స్థాని క తిక్కస్వామి దర్గా వద్ద ఉన్న అంగనవాడీ సెంటర్‌ను ఆకస్మీకం గా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని, గుడ్లను పరి శీలించారు. అనంతరం పిల్లలతో ఆమె మాట్లాడారు. మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. నిరంతరం పిల్లల బరువుపై ఆరా తీయాలన్నారు. అదేవిధంగా ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై గర్భవతులకు, బాలింతలకు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.