Child Abduction and Assault Case: బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:45 AM
నంద్యాల జిల్లా పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసు లో ముద్దాయికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ కర్నూలు..
కర్నూలు లీగల్/పాణ్యం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసు లో ముద్దాయికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయాధికారి రాజేం ద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. నంద్యాలకు చెందిన పఠాన్ మహమ ్మద్ ఖాన్ పాణ్యంలో ఓ హోటల్ నిర్వహించేవాడు. ఆ హోటల్‌కు బాలిక తరుచూ వస్తుండేది. ఈ నేపథ్యంలో పఠాన్ మహమ్మద్ ఖాన్.. వివాహం చేసుకుంటానని బాలికను నమ్మించి 2020 నవంబరు 2వ తేదీన కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాణ్యం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మహమ్మద్ ఖాన్ బాలికను నెల్లూరుకు తీసుకెళ్లి ఓ ఇంట్లో నిర్బంధించాడు. 2020 డిసెంబరు 18న బాలికను వారి ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వెళ్లి పాణ్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కిడ్నాప్, అత్యాచారం సెక్షన్ల కింద పోలీసులు మహమ్మద్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. గురువారం కోర్టులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని, రూ.లక్ష జరిమానా బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీవీ శ్రీనివాసులు వాదించారు.