Share News

నేడు, రేపు ఢిల్లీలో సీఎం

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:38 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళుతున్నారు. బుధ, గురువారాల్లో సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు.

నేడు, రేపు ఢిల్లీలో సీఎం

  • ఎన్డీయే సీఎంల భేటీకి, నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరు

  • రేపు నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి..

అమరావతి, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళుతున్నారు. బుధ, గురువారాల్లో సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. బుధవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం, ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరిగే ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశానికి హాజరవుతారు. రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పార్టీల సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొంటారు. 11వ తేదీ ఉదయం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే నీతి ఆయోగ్‌ 11వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అదే రోజు రాత్రి ఢిల్లీలో బయలుదేరి అమరావతి చేరుకుంటారు.

Updated Date - Jun 10 , 2026 | 04:39 AM