Courtesy Meeting: గోవా గవర్నర్‌తో సీఎం మర్యాదపూర్వక భేటీ
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:33 AM
గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన అశోక్‌గజపతి రాజును సోమవారం తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. భోగాపురంలో నిర్మించే జీఎంఆర్ - మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీకి భూమిని ఇచ్చినందుకు అశోక్‌గజపతిరాజుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నర్‌కు పుట్టినరోజు శాభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పుట్టిన రోజు సందర్భంగగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం సాయంత్రం విజయవాడలోని లోక్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లోక్‌భవన్ అధికారులు స్వాగతం పలికారు.