Share News

చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం ‘పిల్లూ ఏఐ’

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:43 AM

చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘పిల్లూ ఏఐ’ యాప్‌ అందుబాటులోకి వచ్చింది.

చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం ‘పిల్లూ ఏఐ’

  • కొత్త యాప్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • ఇన్వాయిస్‌, బిల్లింగ్‌, అకౌంటింగ్‌ ఇక సులభం

విజయవాడ సిటీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘పిల్లూ ఏఐ’ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా రూపొందించిన ఈ వాయిస్‌ ఆధారిత బిల్లింగ్‌, అకౌంటింగ్‌ యాప్‌ను సీఎం చంద్రబాబు అమరావతి సచివాయలంలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాప్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో పనిచేస్తుంది. ఎటువంటి అకౌంటింగ్‌ పరిజ్ఞానం లేకపోయినా.. వ్యాపారులు వాయిస్‌ కమాండ్‌ ద్వారా తమ రోజువారీ వ్యాపార వ్యవహారాలను సులభంగా చక్కబెట్టవచ్చని సీఎం తెలిపారు. తెలుగుతోపాటు ఐదు భాషల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ ద్వారా బిల్లులు, ఇన్వాయి్‌సలు, బ్యాలెన్స్‌ షీట్‌, బ్యాంకు స్టేట్‌మెంట్లు సులువుగా రూపొందించవచ్చన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ విజయానంద్‌, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ‘పిల్లూ ఏఐ’ వ్యవస్థాపకులు సురేశ్‌, రామ్మోహన్‌, సాయిప్రణీత్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 03:45 AM