2029లో మళ్లీ గెలుపే లక్ష్యం
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:51 AM
‘రాష్ట్రంలో 2029లో మళ్లీ కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలి. క్రమశిక్షణ, నిజాయితీతో కష్టపడండి. గెలుపు కోసం కష్టపడి చేస్తామంటూ నాకు భరోసా ఇవ్వండి’ అని..
క్రమశిక్షణతో కష్టపడండి
కార్యకర్తలను నేను చూసుకుంటా
ఆచంట టీడీపీ శ్రేణులకు చంద్రబాబు భరోసా
భీమవరం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో 2029లో మళ్లీ కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలి. క్రమశిక్షణ, నిజాయితీతో కష్టపడండి. గెలుపు కోసం కష్టపడి చేస్తామంటూ నాకు భరోసా ఇవ్వండి’ అని టీడీపీ శ్రేణులను సీఎం చంద్రబాబు కోరారు. సిద్ధాంతం పర్యటనలో భాగంగా ఆచంట నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. కార్యకర్తలను తాను జాగ్రత్తగా చూసుకుంటానని.. వారంతా ప్రజల్లోనే ఉండాలని కర్తవ్యబోధ చేశారు. ‘అధికారులంతా మన మాట వింటారు. ప్రజలతో మమేకమవ్వండి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి వివరించి చెప్పండి’ అని సూచించారు. కార్యకర్తల కోసం రూ.5 లక్షల బీమా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు కలసి మెలసి ఉండాలని దిశానిర్దేశం చేశారు.