విశాఖ పోర్టును సందర్శించిన జస్టిస్ లీసా గిల్
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:49 AM
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ బుధవారం విశాఖపట్నం పోర్టును సందర్శించారు
విశాఖపట్నం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ బుధవారం విశాఖపట్నం పోర్టును సందర్శించారు. ఆమెకు పోర్టు చైర్మన్ జస్మీత్‌సింగ్ బింద్రా, కార్యదర్శి శంకర్‌బాబు స్వాగతం పలికారు. పోర్టు అథారిటీ కార్యకలాపాలు, పోర్టు నిర్వాహణ, కార్గో సామర్థ్యం, మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునికీకరణ కార్యక్రమాలు, పోటీ తట్టుకునేందుకు చేపడుతున్న వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ఆమెకు వివరించారు.