Share News

కాణిపాక వినాయకుణ్ణి దర్శించుకున్న సీఈసీ

ABN , Publish Date - May 11 , 2026 | 04:23 AM

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ఆదివారం కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.

కాణిపాక వినాయకుణ్ణి దర్శించుకున్న సీఈసీ

ఐరాల(కాణిపాకం), మే 10 (ఆంధ్రజ్యోతి): భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ఆదివారం కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జ్ఞానేశ్‌కుమార్‌కు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషారదూడి, ఈవో పెంచలకిషోర్‌ ఆలయ మర్యాదలతో స్వా గతం పలికారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఆయనతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌యాదవ్‌ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామిని కూడా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ దర్శనం చేసుకున్నారు.

Updated Date - May 11 , 2026 | 04:25 AM