Share News

‘మంతెన’లో చికిత్సకు చెవిరెడ్డికి అనుమతి

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:15 AM

మద్యం కుంభకోణంలో విజయవాడ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఫిజియోథెరపి చేయించుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.

‘మంతెన’లో చికిత్సకు చెవిరెడ్డికి అనుమతి

విజయవాడ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో విజయవాడ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఫిజియోథెరపి చేయించుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నందున ఉండవల్లిలో ఉన్న మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదప్రతివాదనలు ముగియడంతో కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. 15 రోజులపాటు వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, ఈ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అనిల్‌చోఖ్రా తాగడానికి వేడినీళ్లను సమకూర్చాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.

Updated Date - Jan 24 , 2026 | 05:16 AM