బాలికపై లైంగిక వేధింపులు న్యాయవాది అరెస్టు
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:23 AM
పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక అంబత్తూరుకు చెందిన బాలిక తల్లిదండ్రులు శనివారం బయటకు వెళ్లగా, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని గమనించిన ఇంటి యజమాని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సాయంత్రానికి ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు ఆ బాలిక రోదిస్తూ విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇంటి యజమానిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి న్యాయవాది అని పోలీసులు తెలిపారు