Share News

రైలు ఢీకొని చిరుత మృతి

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:58 AM

కర్నూలు జిల్లా కోసిగి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని ఓ ఆడ చిరుతపులి మృతి చెందింది. కోసిగి-పీకలబెట్ట మార్గంలో రైలుపట్టాల పక్కన గురువారం...

 రైలు ఢీకొని చిరుత మృతి

కర్నూలు జిల్లా కోసిగి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని ఓ ఆడ చిరుతపులి మృతి చెందింది. కోసిగి-పీకలబెట్ట మార్గంలో రైలుపట్టాల పక్కన గురువారం ఉదయం చిరుత కళేబరాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. పులి కళేబరం నుంచి సేకరించిన శాంపిళ్లను కర్నూలు రాయలసీమ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు, చెన్నై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు జిల్లా ఫారెస్టు అధికారిణి శ్యామలాదేవి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పులి మృతదేహాన్ని దహనం చేశారు.

- కోసిగి, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 06 , 2026 | 02:58 AM