Sankranti Festival: ఏలూరులో ఎగసిన సందడి..
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:14 AM
ప్రతి చోటా కోళ్లు కత్తులతో రివ్వున ఎగిరాయి. బరులు హైటెక్ హంగులు, అలంకారాలతో ఆకట్టుకున్నాయి. ఏలూరు జిల్లాలో బుధవారం సుమారు రూ.30 కోట్ల పైబడి కోడి పందేల్లో చేతుల మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి చోటా కోళ్లు కత్తులతో రివ్వున ఎగిరాయి. బరులు హైటెక్ హంగులు, అలంకారాలతో ఆకట్టుకున్నాయి. ఏలూరు జిల్లాలో బుధవారం సుమారు రూ.30 కోట్ల పైబడి కోడి పందేల్లో చేతుల మారాయి. బరుల వద్దే గుండాట, పేకాటలు సాగాయి. పెదవేగి మండలం దుగ్గిరాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నారాయణపురంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కొయ్యలగూడెంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పందేలను ప్రారంభించారు. ఈ జిల్లాలో చిన్నచితకా కలిపి 150 వరకు బరులు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించారు. కొయ్యలగూడెం రామానుజపురంలో నాలుగు ఎకరాల పామాయిల్ తోటలో ఏర్పాటు చేసిన బరిలో 15 పందేల్లో కనీసం 8 పందేలు గెలిచిన వ్యక్తికి రూ.2.50 లక్షల బుల్లెట్‌ను బహుకరించారు. ఇదే మండలం గవరవరంలో నూతగ్గి ఆశా జ్యోతి ఎక్కువ పందేలు గెలిచి బుల్లెట్ గెలుచుకున్నారు. ముదినేపల్లి మండలంలోను బుల్లెట్‌లను బహుకరించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల బరిలో కోడిపందేల్లో గెలిచిన వారికి క్రెటా కారు, రెండు బుల్లెట్లు నజరానాగా ప్రకటించారు.