Share News

రుయాలో చంద్రికకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:31 AM

చిట్టి తల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్నమయ్య జిల్లా ములకలచెరువులోని రాజీవ్‌కాలనీకి చెందిన విజయమ్మ రెండో కుమార్తె చంద్రికను అంతుచిక్కని వ్యాధి కబళిస్తోంది.

రుయాలో చంద్రికకు వైద్య పరీక్షలు

  • ఐదురోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యుల సూచన

  • ‘ఆంధ్రజ్యోతి’ చొరవతోనే అంటూ కుటుంబీకుల ఆనందం

ములకలచెరువు, జూలై 5(ఆంధ్రజ్యోతి): చిట్టి తల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్నమయ్య జిల్లా ములకలచెరువులోని రాజీవ్‌కాలనీకి చెందిన విజయమ్మ రెండో కుమార్తె చంద్రికను అంతుచిక్కని వ్యాధి కబళిస్తోంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో శనివారం ‘చిట్టి తల్లిని కాపాడరూ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పందించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య ఆదేశాలతో ఆదివారం చంద్రికను 108 వాహనంలో సిబ్బంది మధుసూదన్‌, ఆశ వర్కర్లు తిరుపతి రుయాస్పత్రికి తీసుకువెళ్లి పిల్లల వార్డులో చేర్చారు. రుయాస్పత్రి సూపరింటెండెంట్‌ మనోహర్‌, చర్మ వ్యాధులకు సంబంధించిన వైద్య నిపుణుల బృందం చిన్నారికి పలు రకాలు పరీక్షలు జరిపారు. రక్త నమునాలు సేకరించి, కంటిపై ఉన్న గడ్డ శాంపిల్‌ తీసి పరీక్షలకు పంపారు. ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండాలని, భోజన, వసతి కల్పిస్తామని చిన్నారి తల్లి విజయమ్మకు సూపరింటెండెంట్‌ తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో తమ బిడ్డకు వైద్య సేవలు అందడం సంతోషంగా ఉందని చిన్నారి కుటుంబీకులు పేర్కొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 05:32 AM