Share News

విజన్‌ 2047 చంద్రబాబు లక్ష్యం

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:14 AM

నాడు విజన్‌ 2020.. నేడు విజన్‌ 2047 లక్ష్యంగా పనిచేస్తున్న దూరదృష్టి, దార్శనికత కలిగిన నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎన్టీఆర్‌..

విజన్‌ 2047 చంద్రబాబు లక్ష్యం

  • కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి

కుప్పం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): నాడు విజన్‌ 2020.. నేడు విజన్‌ 2047 లక్ష్యంగా పనిచేస్తున్న దూరదృష్టి, దార్శనికత కలిగిన నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఇందులో ప్రధానమైనది పారిశ్రామికాభివృద్ధి.. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమని చెప్పారు. తన రెండో రోజు పర్యటనలో బుధవారం ఆమె చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన మెగా జాబ్‌మేళాకు హాజరయ్యారు. అనంతరం గుడుపల్లె మండలం పెద్దకోటమాకనపల్లెలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. చంద్రబాబు సామర్థ్యం మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మహిళా సాధికారతతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. చంద్రబాబు.. ఓట్ల కోసం హామీలు ఇచ్చే రకం కాదని, ఆరునూరైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తీరుతారని భరోసా ఇచ్చారు.

Updated Date - Mar 26 , 2026 | 03:14 AM