Share News

నేడు ఢిల్లీకి చంద్రబాబు

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:15 AM

సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 7.20 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో...

నేడు ఢిల్లీకి చంద్రబాబు

  • రేపు అమిత్‌షా సహా కేంద్ర మంత్రులతో భేటీ

  • మంగళవారం సాయంత్రం తిరిగి బెజవాడకు

సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 7.20 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరి 9.35కి అక్కడకు చేరుకుంటారు. 1-జన్‌పథ్‌ నివాసంలో రాత్రికి బస చేస్తారు. మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. హోంమంత్రి అమిత్‌షాతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో బయల్దేరి 8గంటలకు విజయవాడ చేరుకోనున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 04:17 AM