మే 7, 8 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సమావేశం..!
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:23 AM
రాష్ట్ర ప్రభుత్వం 7వ విడత(4.7) కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధం అయింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 28 జిల్లా కలెక్టర్లతో...
వేదిక కానున్న సీఆర్‌డీఏ కార్యాలయం?
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 7వ విడత(4.7) కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధం అయింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 28 జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు మే 7, 8 తేదీలను దాదాపు ఖరారు చేసింది. ఈ తేదీలను జీఏడీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సమాచారం జీఏడీ నుంచి కలెక్టర్లకు అందింది. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను సచివాలయంలో కాకుండా నూతన సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సీఆర్‌డీఏ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్ పెద్దగా ఉండడంతో పాటు ఆధునాత టెక్నాలజీతో సిద్ధం చేశారు.