క్వాంటమ్ హార్డ్‌వేర్ పరిశోధనకు కంప్యూటర్లు సిద్ధం
ABN , Publish Date - Apr 11 , 2026 | 02:58 AM
అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలకు రాష్ట్రం సన్నద్ధమైంది. ఇప్పటి వరకు బ్రహ్మపదార్థంగా ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ ..
14న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలకు రాష్ట్రం సన్నద్ధమైంది. ఇప్పటి వరకు బ్రహ్మపదార్థంగా ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని ప్రపంచం ముందుంచేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ తలుపులు తెరిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వన్ ఎస్, వన్ క్యూ క్వాంటమ్ కంప్యూటర్లను ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఒకటి.. గన్నవరం మేధాటవర్స్‌లో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ రెండు క్వాంటమ్ టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను సీఎం చంద్రబాబు 14వ తేదీన ప్రారంభిస్తారు. క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్‌వేర్ పనితీరును పరిశోధించేందుకు ఈ రెండు టెస్ట్ బెడ్స్ ఉపయోగపడతాయి. ఆల్గారిథమ్స్‌కు, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు ఉపయోగపడవు.