Share News

పురాణాలను దూషించిన రావణ్‌కు వైసీపీ అండ

ABN , Publish Date - Jul 10 , 2026 | 04:58 AM

పురాణాలు, సీతమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడిన యూట్యూబర్‌ ‘ప్రశ్న’ రావణ్‌కు వైసీపీ అండదండలు అందిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘తీవ్రవాదాన్ని, పాకిస్థాన్‌ను రావణ్‌ సమర్థించాడు.

పురాణాలను దూషించిన రావణ్‌కు వైసీపీ అండ

  • తీవ్రవాదానికీ, పాకిస్థాన్‌కూ అతడి మద్దతు

  • అలాంటివాడికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం

  • ‘హే రామ్‌’ అంటూ రావణులకు ప్రోత్సాహమా : సీఎం

పురాణాలు, సీతమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడిన యూట్యూబర్‌ ‘ప్రశ్న’ రావణ్‌కు వైసీపీ అండదండలు అందిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘తీవ్రవాదాన్ని, పాకిస్థాన్‌ను రావణ్‌ సమర్థించాడు. అలాంటివాడికి గొడ్డలి పార్టీ అండగా ఉండి ఆర్థిక సాయం చేసే పరిస్థితి వచ్చింది. ఇది న్యాయమా..? గొడ్డలి పార్టీ మరింత బరితెగింపునకు పాల్పడుతోంది. రాష్ట్రంలో విధ్వంసం చేస్తోంది. అంతర్వేదీ రథం దహనం, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల చోరీ, రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసినా, గత పాలకులు పట్టించుకోలేదు. చివరికి తిరుపతి లడ్డూ, నెయ్యి కూడా కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. రెండ్రోజుల కిందట ఆదోని శివాలయ దీపంలో ఓ దుర్మార్గుడు సిగరెట్‌ వెలిగించి అపచారం చేస్తే వెంటనే కటకటాల్లోకి నెట్టాం. తిరుమలకు వెళ్లి డిక్లరేషన్‌ ఇమ్మంటే.. తిరస్కరించి అపచారం చేశారు. నేను చర్చికి వెళ్లినా... మసీదుకు వెళ్లినా.. అక్కడి మతాచారాలను గౌరవిస్తాను. ‘హే రామ్‌’ అంటూ రావణులను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను ఏమనాలో కూడా తెలియడం లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదు’’ అని సీఎం హెచ్చరించారు.

Updated Date - Jul 10 , 2026 | 04:58 AM