Share News

చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో.. నలుగురు నిందితుల బెయిల్‌ రద్దు

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:43 AM

సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేసి ఆయన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో మొదటి నలుగురు నిందితులకు హైకోర్టు గట్టి షా కిచ్చింది.

చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో.. నలుగురు నిందితుల బెయిల్‌ రద్దు

  • లొంగిపోవాలని హైకోర్టు ఆదేశం

  • వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక తదితరులకు షరతులతో ముందస్తు బెయిల్‌ మంజూరు

  • ఉల్లంఘిస్తే రక్షణ ఉండదు: న్యాయమూర్తి

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేసి ఆయన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో మొదటి నలుగురు నిందితులకు హైకోర్టు గట్టి షా కిచ్చింది. పోలీసులు పెట్టిన హత్యాయత్నం, తదితర తీవ్రమైన సెక్షన్లు వారికి వర్తించవంటూ సొం త పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేస్తూ నందిగామ కోర్టు 2024 నవంబరు 23న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. తమ తీర్పు ప్రతి అందిన వా రం రోజుల్లో సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు లొంగిపోవాలని నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్‌, పరిమి కిశోర్‌, ఎం.శ్రీనివాసరావులను ఆదేశించింది. ఇదే కేసులో వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, ఆయన సోదరుడు మొండితో క జగన్మోహనరావు, మరికొందరు నిందితులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటజ్యోతిర్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా నందిగామలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన రాళ్లదాడి లో ఆయన ప్రధాన భద్రతాధికారి మధుసూధనరా వు గాయపడ్డారు. భద్రతాధికారి ఫిర్యాదు ఆధారం గా నందిగామ పోలీసులు.. నిందితులెవరో పేర్కొనకుండా ఐపీసీ సెక్షన్‌ 324 కింద 2022 నవంబరు 5న కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఘటనపై లోతైన దర్యాప్తు చేశారు. చంద్రబాబును అంతమొందించాలనే ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని తేలడంతో ఐపీసీ 307(హ త్యాయత్నం), 120బీ(నేరపూరితకుట్ర) తదితర సెక్షన్లు చేర్చారు.


మొదటి నలుగురు నిందితులను అరెస్టు చేసి 2024, నవంబరు 23న నందిగామ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అయితే ఈ సెక్షన్లు వారికి వర్తించవన్న న్యాయాధికారి బెయి ల్‌ మంజూరు చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నందిగామ సీఐ గత ఏడాది నవంబరులో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదన లు వినిపించారు. కాగా, ఇదే కేసులో ముందస్తు బెయిల్‌ పొందిన వారికి కోర్టు పలు షరతులు విధించింది. పాస్‌పోర్టును దర్యాప్తు అధికారికి స్వాధీనపరచాలని.. చార్జిషీటు దాఖలు చేసేవరకు ప్రతి ఆదివారం ఉదయం10-సాయంత్రం 6 వరకు ఐవో ముందు హాజరుకావాలని ఆదేశించింది.

Updated Date - Mar 15 , 2026 | 05:43 AM