Share News

నేడు నిడదవోలులో సీఎం పర్యటన

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:00 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి ...

నేడు నిడదవోలులో సీఎం పర్యటన

నిడదవోలు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు నిడదవోలు సెయింట్‌ అంబ్రోస్‌ స్కూల్‌ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గాన 11.20 గంటలకు సింగవరం రోడ్‌లో ఏర్పాటు ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. ప్రజావేదిక నుంచి 1.50 గంటలకు మాలకోడు చెరువు (రామకృష్ణన్‌ లయన్స్‌ ఐ హాస్పిటల్‌ దగ్గర) వద్ద, 2.20 గంటల వరకు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. చెరువు ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తారు. ఎస్‌టీబీ ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి శాస్త్రవేత్తలతో చర్చిస్తారు. 2.30 గంటలకు సెయింట్‌ అంబ్రోస్‌ స్కూల్‌ వద్దకు చేరుకుని అక్కడ 4 గంటల వరకు నాయకులు, కార్యకర్తలతో సమీక్షిస్తారు. 4.15 గంటలకు హెలికాప్టర్‌ లో బయలుదేరి ఉండవల్లి వెళతారు.

Updated Date - Apr 18 , 2026 | 04:00 AM