ఏబీఎన్ పూర్ణ కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:08 AM
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ స్టేట్ బ్యూరో సీనియర్ రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు...
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ స్టేట్ బ్యూరో సీనియర్ రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు(ఏబీఎన్ పూర్ణ) కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ పటమటలంకలోని పూర్ణ నివాసానికి వెళ్లిన బాబు, సుమారు 20 నిమిషాలు పూర్ణ కుటుంబ సభ్యులతో గడిపి ధైర్యం చెప్పారు. పూర్ణ తనకు ఎంతోకాలంగా వ్యక్తిగతంగా తెలుసని, మంచి పాత్రికేయుడిని, ఆత్మీయుడిని కోల్పోయానని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్ణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.