కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:57 AM
కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టుల ...
ఉత్తరాంధ్రలోనే రేర్ ఎర్త్ కారిడార్: చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై వారికి దిశానిర్దేశం చే శారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులతో పా టు దేశవ్యాప్తంగా ప్రకటించిన వాటిని రాష్ట్రానికి తె చ్చుకునే అంశంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. కేంద్రప్రాయోజిత పథకాలు, వివిధ కార్యక్రమాలను అనుసంధానం చేసుకుంటూ అదనపు నిధులు సాధించాలని సూచించారు. రేర్ ఎర్త్ కారిడార్‌ను ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని స్పష్టం చే శారు. వీటితోపాటు ఇతర విలువైన ఖనిజాలకు సంబంధించి వాల్యూ చైన్ పరిశ్రమలను ఏర్పాటు చేసే ఆలోచనను ముం దుకు తీసుకెళ్లాలన్నారు. తీరప్రాంతంలో ఉన్న మూలపేట నుంచి దిగువన కృష్ణపట్నం వరకూ ఈస్ట్‌కోస్ట్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదన సి ద్ధం చేయాలని సూచించారు. కంటైనర్లు, వివిధ పరికరాల తయారీ ప్రాజెక్టులను త్వరగా పట్టాలెక్కించాలన్నారు. పల్నాడులో మెగా టెక్స్‌టైల్ పార్కు, తిరుపతిలో స్పోర్ట్స్ తయారీ హబ్ ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని చెప్పారు. ‘ఇండి యా సెమీకండక్టర్ మిషన్ 2.0’లో భాగంగా సెమీకండక్టర్ డిజైన్ తదితర ప్రాజెక్టులను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. వీటితో పాటు రాజధాని ప్రాం తంలోని హెల్త్‌సిటీలో బయోడిజైన్, మె డ్ టెక్‌పార్కు, బయోఫార్మా శక్తి మిషన్‌తో ఎకో సిస్టమ్ వస్తుందన్నారు. ‘మెడికల్ టూరిజం-హీల్ ఇన్ ఏపీ’ అన్న విధానంలో అమరావతి ప్రాజెక్టులు చేపట్టాలని తెలిపారు. హిందూపురంలో ఎలక్ర్టానిక్స్ పరికరాల తయారీని ప్రతిపాదించాలన్నారు. తిరుపతిని టూరిజం డెస్టినేషన్ కింద అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్పారు. కేంద్రం నుంచి ఎక్కువ ఎలక్ర్టిక్ బస్సులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ వివిధ పథకాలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయగలిగితే అదనపు నిధులను కూడా డ్రా చేసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో అన్నారు.