Share News

గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:52 AM

గొడ్డలి పార్టీకి విమర్శలు, విధ్వంసం తప్ప ఏమీ చేతకాదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేసే పనుల్లో ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రజలకు అర్థమవుతోంది గానీ....

గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు

  • డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలంటున్నారు

  • పక్కా ఆధారాలుంటే నిరూపించాలి: చంద్రబాబు

అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీకి విమర్శలు, విధ్వంసం తప్ప ఏమీ చేతకాదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేసే పనుల్లో ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రజలకు అర్థమవుతోంది గానీ, ఆ పార్టీకి అర్థం కావడం లేదని విమర్శించారు. ఆరోగ్యకర రాజకీయాలు చేయలేని వారిని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అసత్యాన్ని పదే పదే చెబితే ప్రజలు విశ్వసిస్తారని కొందరు అనుకుంటున్నారు. డీఎస్సీ నియామకాలకు టీడీపీ ఓ బ్రాండ్‌. అధికారంలోకి రాగానే కట్టుదిట్టంగా డీఎస్సీ పరీక్ష నిర్వహించి నియామకాలు పూర్తి చేశాం. స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు జరిగాయంటున్నారు. అసలా కోటాలో ఏయే క్రీడలు న్నాయో కూడా వారికి తెలియదు. బ్రిడ్జ్‌ ఆటను భారత ప్రభుత్వమే గుర్తించింది. దాన్ని పట్టుకుని పేకాట ఆడేవారికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్‌ల ద్వారా గుడ్డ కాల్చి మొహం మీద వేయడమే వారికి తెలుసు. పక్కా ఆధారాలుంటే నిరూపించాలి. ఏది పడితే అది మాట్లాడితే కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకునే జ్ఞానం గొడ్డలి పార్టీకి లేదు. యోగాంధ్ర నిర్వహణకు రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటాయించాం. దీనిపైనా విమర్శలు చేస్తారు’ అని ధ్వజమెత్తారు.

Updated Date - Jun 04 , 2026 | 04:52 AM