సౌర విద్యుత్ కేంద్రంగా రాయలసీమ
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:01 AM
సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకంగా రాయలసీమ అధికారులు గరిష్ఠస్థాయిలో సోలార్ విద్యుదుత్పత్తిని సాధించేలా....
ముఖ్యమంత్రి అధ్యక్షతన 16వ ఎస్‌ఐపీబీ సమావేశం
39,436 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు
విశాఖలో ఇన్ఫోసిస్.. సీమలో గ్రీన్ ఎనర్జీ యూనిట్లు
31 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకంగా రాయలసీమ అధికారులు గరిష్ఠస్థాయిలో సోలార్ విద్యుదుత్పత్తిని సాధించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తి యూనిట్లను ఎక్కువగా రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. సీఎంచంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవా రం 16వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. పరిశ్రమ లు, విద్యుత్తు, టూరిజం, ఐటీ, ఆహార తయారీ రం గాలకు చెందిన 31 ప్రాజెక్టుల ద్వారా రూ. 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదించింది. ఈ పెట్టుబడుల ద్వారా 1,11,276 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని సంస్థలు ప్రతిపాదించాయి. రాయలసీమలో సౌర విద్యుత్తు ఉత్పత్తి పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉత్పత్తి అయిన విద్యుత్తును రాష్ట్ర, సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ సూచించారు. భవిష్యత్తులో ఉత్పత్తయిన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు అందించేలా ట్రాన్స్‌మిషన్ లైన్లను నిర్మించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో సౌర విద్యుత్తు ఉత్ప త్తి అవుతున్నా ట్రాన్స్‌మిషన్ లైన్లు లేకపోవడంతో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ప్రాంతంలో గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రీన్ విద్యుత్తును రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకునేలా ట్రాన్స్‌మిషన్ లైన్లను వేయాలని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
‘‘రాష్ట్రంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లను స్థాపించేలా దృష్టి సారించాలి. రాష్ట్రం జీసీసీలకు కేం ద్రంగా మారాలి. వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వారంగంలోని వ్యర్థాలనూ సద్వినియోగం చేసేలా బై ప్రొడక్టు యూనిట్లను ప్రోత్సహించాలి. పరిశ్రమల్లో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ఉండాల్సిందే. సే ఫ్టీ స్టాండర్డ్స్‌ను నిర్దేశించాలి. ఫార్మా, స్టీల్, గ్రీన్ ఎన ర్జీ, బీఈఎ్‌సలాంటి ప్రాజెక్టులు ఏర్పాటవుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకంగా ఓ స్టాం డర్డ్ ఆఫ్ ప్రొసీజర్(ఎస్‌ఓపీ)ని సిద్ధం చేయాలి. విప త్తు నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఈ భ ద్రతా ప్రమాణాలను పారిశ్రామిక యూనిట్లు కలిగి ఉండాలి. ఇటీవల రాష్ట్రంలోని బాణసంచా తయారీ యూనిట్లలో ప్రమాదాల నేపథ్యంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
అమరావతి క్వాంటమ్ టవర్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలి. క్వాంటమ్ వ్యాలీలో మూడు ప్రాజెక్టులను స్థాపించేందుకు వచ్చిన ప్రతిపాదనలు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలి. భూములు కేటాయించిన పర్యాటక ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలి. ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు వేగవంతంగా ఉత్పత్తి చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. వీటితో పాటు భాగస్వామ్య సదస్సులో కు దుర్చుకున్న ఒప్పందాలూ సాకారమయ్యేలా చూడా లి. ప్రతీ ఎస్‌ఐపీబీలోనూ భారీ ప్రాజెక్టులపై సమీక్షిద్దాం. పామాయిల్, కోకో లాంటి ఉద్యానవన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలి. ఉద్యాన ఉత్పత్తులు 200 మెట్రిక్ టన్నుల నుంచి 400 మెట్రిక్ టన్నులకు పెంచాలి. దీనికి తగినట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెరిగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్రంలోని 175 ఎంఎ్‌సఎంఈ పార్కుల్లోనూ యూనిట్లను ఏర్పాటు చేసే లా చూడాలి’’ అని సీఎం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల్లోనే 264 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని సమావేశంలో అధికారులు వివరించారు. వీటిద్వారా రూ. 9.36 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. విశాఖ భాగస్వామ్య ఒప్పంద సదస్సు ద్వారా 538 ఎంవోయూలకు గాను రూ. 11.58 లక్షల పెట్టుబడులు, 13.95 లక్షల మందికి ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. సమావేశంలో మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, పి.నారాయణ, కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, బీసీ జనార్దనరెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ జి.సాయిప్రసాద్, సీఎం ఎస్‌పీసీఎస్ కె.విజయానంద్ పాల్గొన్నారు.