చంద్రబాబు జీవిత ప్రస్థానంపై ‘కాలపురుషుని సంతకం’
ABN , Publish Date - May 29 , 2026 | 04:13 AM
సీఎం చంద్రబాబు అసాధారణ జీవిత ప్రస్థానానికి సంబంధించి ‘కాలపురుషుని సంతకం’ పేరుతో ప్రముఖ వాస్తు శిల్పి, రచయిత నర్రా రామకృష్ణ రచించిన పుస్తకాన్ని గురువారం మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు ....
మహానాడులో ఆవిష్కరించిన సీఎం
గుంటూరు, అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు అసాధారణ జీవిత ప్రస్థానానికి సంబంధించి ‘కాలపురుషుని సంతకం’ పేరుతో ప్రముఖ వాస్తు శిల్పి, రచయిత నర్రా రామకృష్ణ రచించిన పుస్తకాన్ని గురువారం మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహానాడు వేదికపై పుస్తక రచయిత నర్రా రామకృష్ణకు మాట్లాడే అవకాశం కలిపించారు. రామకృష్ణ మాట్లాడుతూ ‘మీకు ఉన్న జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీతో పాటు దేవగణాలు కూడా మీతో పాటు ఉండి ఒక రహస్య వలయంలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి’ అని ఎవరికీ తెలియని అనేక విషయాలు వివరించడంతో సభ్యుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ పుస్తకంలో చంద్రబాబు జీవిత ప్రస్థానానికి సంబందించిన అనేక కీలక ఘట్టాలను లోతుగా వివరించినట్లు రామకృష్ణ తెలిపారు.