Share News

యువత భవితకు పునాది..!

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:49 AM

రాజధాని అమరావతిలో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అమరావతిని గ్లోబల్‌ క్వాంటమ్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడనుంది.

యువత భవితకు పునాది..!

  • క్వాంటమ్‌ వ్యాలీ భవనాలకు నేడే శంకుస్థాపన

  • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ

అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అమరావతిని గ్లోబల్‌ క్వాంటమ్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడనుంది. దేశ సాంకేతిక రంగాన్ని మలుపుతిప్పే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీ భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెంలో జరిగే భూమి పూజ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ హబ్‌ కోసం రూ.9,000 కోట్లతో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆకృతిలో ఐకానిక్‌ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఆమోదం పొందిన ఈ డిజైన్లు ఆకట్టుకున్నాయి. తొలిదశలో 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే భవనాన్ని ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి మొత్తం భవనాన్ని సిద్ధం చేసి.. డిసెంబరు నాటికి పూర్తిస్థాయిలో కంప్యూటర్లను తీసుకురావాలని.. లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కాగా, అమెరికాలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న నాలు గు ఐబీఎం క్యాంటమ్‌ కంప్యూటర్‌ మిషన్లను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కూడా కూ టమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంట మ్‌ వ్యాలీ ఏపీతోపాటు దేశానికి కూడా మైలురాయిగా నిలువనుందని ఐటీ శా ఖ అధికారులు చెబుతున్నారు. 133 క్యూబిక్స్‌ సామర్థ్యంతో కూడిన క్వాంటమ్‌ కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, కమ్యూనికేషన్‌, సైబర్‌ సెక్యూరిటీ, డిఫెన్స్‌, హెల్త్‌ కేర్‌, ఫైనాన్స్‌ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు క్వాంటమ్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

Updated Date - Feb 07 , 2026 | 03:50 AM