Share News

ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి

ABN , Publish Date - Apr 16 , 2026 | 05:52 AM

‘పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తాను. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృథా. అందుకే అన్నార్తుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి

  • అన్నదానాన్ని అడ్డుకున్న గొడ్డలి పార్టీ

  • సీఎం చంద్రబాబు ధ్వజం

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ‘పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తాను. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృథా. అందుకే అన్నార్తుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి(ధరణికోట)లో చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను కార్మికులతో కలసి బుధవారం ప్రారంభించారు. ఇక్కడి నుంచే వర్చువల్‌గా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 62 అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. ధరణికోట క్యాంటీన్‌లో పేదలు, కార్మికులకు స్వయంగా భోజనం వడ్డించారు. రూ.5 ఇచ్చి టోకెన్‌ కొనుగోలు చేసి కార్మికులతో కలిసి భోజనం చేశారు. రుచి, శుభ్రత, నాణ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పట్టణాల్లో 204, గ్రామాల్లో 65 కలిపి అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి పెరిగిందని.. త్వరలో మరో 5 అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. ‘గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్న క్యాంటీన్లపైనా దాడులు చేశారు. పేదల కడుపు నింపే పథకాన్ని నిలిపివేశారు. వ్యక్తులు, సంస్ధలు స్వచ్ఛందంగా అన్నదానం చేస్తుంటే దానిలో మట్టి పోసి, దాడులు చేసి అడ్డుకున్నారు. వైసీపీకి కావలసింది విధ్వం సం, హింస, కూల్చడం, నరకడం, నాశనం చేయడమే. ఏ పార్టీ అయి నా ప్రజలకు ఏం చేస్తామో చెబుతుంది. కానీ వైసీపీ మాత్రం 2029లో విధ్వంసం చూపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అందుకే ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీగా మార్చుకోవాలి’ అని విరుచుకుపడ్డారు.

Updated Date - Apr 16 , 2026 | 05:53 AM