AP Biodiversity Board Chairman: చంద్రబాబు ఒరిజినల్ దావోస్ మ్యాన్
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:45 AM
ఏపీ సీఎం చంద్రబాబు ‘ది ఒరిజినల్ దావోస్ మ్యాన్’ అని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
పెట్టుబడులు తేవడమే ఆయన లక్ష్యం: నీలాయపాలెం
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు ‘ది ఒరిజినల్ దావోస్ మ్యాన్’ అని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉమ్మడి ఏపీ మొదలుకొని నవ్యాంధ్ర ప్రదేశ్ వరకు 30 ఏళ్లలో 15 సార్లు దావోస్‌కు వెళ్లి రాష్ట్రాభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం కృషి చేయడం చంద్రబాబు అంకితభావానికి నిదర్శనం. 1997లో తొలిసారి దావోస్ వెళ్లి రాష్ట్ర స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని కోరిన తొలి సీఎం చంద్రబాబు. దావోస్ అంటే కేవలం ఒప్పందాలు.. సంతకాలు మాత్రమే కాదు. పెట్టుబడిదారుల్లో మన రాష్ట్రంపై నమ్మకం పెంచడం. మన రాష్ట్రంలో ఉన్న వేగవంతమైన వ్యాపార వాతావరణాన్ని వివరించడం. అదే దావోస్ పర్యటన అసలైన లక్ష్యం’ అని నీలాయపాలెం వివరించారు.