Share News

టెక్నాలజీతో నాణ్యమైన వైద్య సేవలు

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:45 AM

టెక్నాలజీ సమర్థవంతంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఉదయం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో...

టెక్నాలజీతో నాణ్యమైన వైద్య సేవలు

  • నారాయణ, జీఎస్‌ఎల్‌వీ కాలేజీలకు అభినందనలు

  • టెలి రోబోటిక్‌ సర్జరీ అద్భుతమన్న సీఎం

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): టెక్నాలజీ సమర్థవంతంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఉదయం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నారాయణ మెడికల్‌ కాలేజీ, జీఎస్ఎల్‌వీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రతినిధులు సీఎంను కలిశారు. ఇటీవల తమ రెండు ఆస్పత్రుల్లో కలిసి టెలి రోబోటిక్‌ సర్జరీ నిర్వహించినట్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. టెలి రోబోటిక్‌ సర్జరీ జరిగిన విధానాన్ని సింధూర, గన్ని భాస్కరరావు ఆయనకు వివరించారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‌లో ఉన్న రోగికి రాజమండ్రిలోని జీఎ్‌సఎల్‌వీ ఆస్పత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ నిర్వహించారు. అలాగే జీఎ్‌సఎల్‌లో ఉన్న రోగికి నారాయణ ఆస్పత్రిలోని వైద్యలు రోబో ద్వారా సర్జరీ చేశామని వివరించారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు ఆస్పత్రుల యాజమాన్యాలను సీఎం అభినందించారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే దూరంగా ఉన్నా సరే నాణ్యమైన వైద్య సేవలు అందించవద్దని ఈ సంస్థలు నిరూపించాయన్నారు. రెండు రోజుల వ్యవధిలో నాలుగు సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమన్నారు. టెలీ రోబోటిక్‌ సర్జరీలు అద్భుతమని సీఎం ప్రశంసించారు.

Updated Date - Apr 28 , 2026 | 07:46 AM