Share News

Indian Ambassador Mridul Kumar: జ్యూరిక్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం

ABN , Publish Date - Jan 20 , 2026 | 06:02 AM

దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జ్యూరిక్‌ విమానాశ్రయంలో దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది.

Indian Ambassador Mridul Kumar: జ్యూరిక్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జ్యూరిక్‌ విమానాశ్రయంలో దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. చంద్రబాబుకు స్విస్‌లో భారత రాయభారి మృదుల్‌ కుమార్‌ స్వాగతం పలికారు. సింగపూర్‌ దేశాధ్యక్షుడు ధర్మన్‌ షణ్ముగరత్నం, అస్సోం సీఎం హేమంత్‌ విశ్వశర్మ, ప్రపంచబ్యాంకు గ్రూప్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ బంగా తదితరులు విమానాశ్రయంలోనే చంద్రబాబును కలిశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీగా ప్రవాసాంధ్రులు విమానాశ్రయానికి తరలివచ్చారు.

Updated Date - Jan 20 , 2026 | 06:02 AM