Share News

పునర్విభజనకు సిద్ధంగా ఉండండి

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:30 AM

‘‘నియోజకవర్గాల పునర్విభజనతో 2029 నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు పెరుగుతాయి. వీటితోపాటు మహిళా రిజర్వేషన్‌ కూడా అందుబాటులోకి రానుంది.

పునర్విభజనకు సిద్ధంగా ఉండండి

  • ‘ఏలూరు’ నేతలతో సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘‘నియోజకవర్గాల పునర్విభజనతో 2029 నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు పెరుగుతాయి. వీటితోపాటు మహిళా రిజర్వేషన్‌ కూడా అందుబాటులోకి రానుంది. పార్టీ పరంగా నేతలందరూ సిద్ధంగా ఉండాలి.’’ అని సీఎం చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై అవగాహన పెంచుకోవాలి. భవిష్యత్తు పరిణామాలకు అనుగుణంగా పార్టీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.’’ అని సీఎం అన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 05:31 AM