Share News

సీఎం కాన్వాయ్‌ కుదింపు

ABN , Publish Date - May 15 , 2026 | 05:11 AM

ప్రధాని మోదీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు.

సీఎం కాన్వాయ్‌ కుదింపు

  • 12 నుంచి నాలుగుకి తగ్గిన వాహనాల సంఖ్య

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే క్యాబినెట్‌ సమావేశానికి నాలుగు వాహనాల కాన్వాయ్‌తో సీఎం ప్రయాణించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. గురువారం ఉదయం ఉండవల్లి నివాసంలో లోకేశ్‌తో జరిగిన బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌కు మంత్రి రామానాయుడు ఎస్కార్ట్‌ వాహనం లేకుండానే వచ్చారు. మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారఽథి కూడా తమ వాహనశ్రేణినిని రెండుకు పరిమితం చేసుకున్నారు. మంత్రి లోకేశ్‌ కాన్వాయ్‌ కూడా నాలుగు నుంచి రెండు వాహనాలకే పరిమితమైంది.

Updated Date - May 15 , 2026 | 05:12 AM