25న తుంగభద్ర గేట్లు ప్రారంభం
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:00 AM
తుంగభద్ర డ్యామ్ కు కొత్తగా బిగించిన 33 క్రస్ట్ గేట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలసి ఈ ...
డీకే శివకుమార్‌తో కలిసి చంద్రబాబు హాజరు
అమరావతి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యామ్ కు కొత్తగా బిగించిన 33 క్రస్ట్ గేట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలసి ఈ నెల 25న బటన్‌నొక్కి పైకి ఎత్తనున్నారు. ఆగస్టులో వరదలకు కొట్టుకుపోయిన ఈ గేట్లను గత నెలలో పూర్తిగా మార్చేశారు. జాతీయస్థాయి నిపుణుడు కన్నయ్యనాయుడు రికార్డు సమయంలో ఈ గేట్లను డిజైన్ చేసి, తయారు చేయించారు. గేట్లను తెరిస్తే.. ఈ ఏడాది ఖరీ ఫ్‌కు తుంగభద్ర నుంచి పంటలకు నీరందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర బోర్డు చైర్మన్ ఎస్‌ఎన్ పాండే మంగళవారం విజయవాడకు రానున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో భేటీ తర్వాత వారిరువురూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశముంది.