Share News

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు చంద్రబాబు శుభాభినందనలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:47 AM

టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ ఆశయాలను, సేవలను కొనసాగించేలా ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రస్థానం సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు చంద్రబాబు శుభాభినందనలు

  • 30వ ఏట అడుగుపెట్టిన ట్రస్ట్‌

అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ ఆశయాలను, సేవలను కొనసాగించేలా ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రస్థానం సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ట్రస్ట్‌ స్థాపించి ఫిబ్రవరి 15తో 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ట్రస్ట్‌ తరఫున సేవలందిస్తున్న వారికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తులో సాయం వంటి కార్యక్రమాలతో ట్రస్ట్‌ సమాజంపై తిరుగులేని ముద్ర వేసిందన్నారు. తలసీమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతరం సేవలందించడంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ చేస్తున్న సేవలు అసామాన్యం అన్నారు. అత్యంత సమర్థవంతమైన సేవలను ఇచ్చే సంస్థగా ట్రస్ట్‌ను నడుపుతున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ భువనేశ్వరికి, వారి బృందానికి అభినందనలు తెలిపారు.

Updated Date - Feb 16 , 2026 | 12:47 AM