Share News

బాబుపై కేసుల రికార్డుల పిటిషన్‌ వాయిదా

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:05 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, తదితరులపై నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు...

బాబుపై కేసుల రికార్డుల పిటిషన్‌ వాయిదా

అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, తదితరులపై నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని.. ఇదే వ్యవహారంపై ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలయ్యాయని తెలిపారు. వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను వారానికి వాయిదా వేశారు. ప్రస్తుత క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లను ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న ఇతర వ్యాజ్యాలకు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. విశ్రాంత రైల్వే ఉద్యోగి యేము కొండలరావు ఈ క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

Updated Date - Feb 24 , 2026 | 05:05 AM