పరిశ్రమలకు అనుసంధానంగా చలపతి యూనివర్సిటీ
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:38 AM
పరిశ్రమలకు అనుసంధానంగా విద్యార్ధుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి చలపతి యూనివర్సిటీ కృషి చేస్తుందని చలపతి విద్యా సంస్ధల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వై.సుజిత్‌కుమార్ పేర్కొన్నారు.
విద్యార్థి దశలోనే ఉపాధి అవకాశాలు కల్పించేలా కోర్సులు
తాడికొండ, జూలై 24(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలకు అనుసంధానంగా విద్యార్ధుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి చలపతి యూనివర్సిటీ కృషి చేస్తుందని చలపతి విద్యా సంస్ధల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వై.సుజిత్‌కుమార్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో చలపతి విద్యాసంస్ధలను వైవీ ఆంజనేయులు ప్రారంభించారని, అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన చలపతి ఇంజనీరింగ్ కళాశాల ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరిందని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నట్టు వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దేందుకు చలపతి విశ్వవిద్యాలయంలో పరిశ్రమ ఆధారిత కరిక్యులమ్‌ను అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పలు గ్లోబల్ సంస్థలతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంటర్‌ప్రైజ్ అండ్ క్లౌడ్, ఎస్‌ఏపీ యూనివర్సిటీ అలియన్స్ ద్వారా క్లౌడ్ అనలిటిక్స్ శిక్షణ, జునిపర్ నెట్‌వర్క్స్‌తో అడ్వాన్స్‌డ్ నెట్‌వర్కింగ్ శిక్షణ, సైబర్ సెక్యూరిటి, ఈసీ కౌన్సిల్ ద్వారా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, జడ్‌స్కేటర్ ద్వారా అడ్వాన్స్‌డ్ క్లౌడ్ సెక్యూరిటీ పరిజ్ఞానం అందిస్తున్నట్టు తెలిపారు. డీప్ టెక్ అండ్ రోబోటిక్స్, యాడ్‌వెర్బ్‌తో ఫిజికల్ ఏఐ, రోబోటిక్స్, కేడెన్స్‌తో బీఎల్‌ఎస్ఐ డిజైన్, మైక్రోచిప్‌తో ఈసీఈ విద్యార్థులకు ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఐవోటీలతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. విద్యార్థులు చదువుతున్న దశలోనే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా చలపతి విశ్వవిద్యాలయంలో సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అకాడమిక్, సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను సమన్వయం చేస్తూ చలపతి విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందని సుజిత్‌కుమార్ స్పష్టంచేశారు.