Share News

శ్రీముఖలింగేశ్వడికి చక్రతీర్థ స్నానం

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:49 AM

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో వెలిసిన శ్రీముఖలింగేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం చక్రతీర్థ స్నానం వైభవంగా నిర్వహించారు.

శ్రీముఖలింగేశ్వడికి చక్రతీర్థ స్నానం

  • అశేష భక్తజనం మధ్య ఉత్సవమూర్తులను చక్రతీర్థ స్నానానికి తీసుకెళ్తున్న దృశ్యం

జలుమూరు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో వెలిసిన శ్రీముఖలింగేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం చక్రతీర్థ స్నానం వైభవంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక ఒడిశా నుంచి కూడా భక్తులు చక్రతీర్థ స్నానాలకు తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుంచే వంశధార నదిలో స్నానం చేసి శ్రీముఖలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం 11.30 గంటలకు పార్వతీపరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను నంది వాహనంపై ఆశీనులను చేశారు. స్వామివారిని ఊరేగింపుగా వంశధార నది మిరియాపల్లి రేవుకు తీసుకుని వెళ్లారు. అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులకు చక్రతీర్థ స్నానాలు జరిపించారు.

Updated Date - Feb 19 , 2026 | 04:50 AM