ఏపీకి కేంద్రం అండ
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:06 AM
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాభివృద్ధి రోడ్‌మ్యా్‌పను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ స్పష్టం చేశారు.
చంద్రబాబు డైనమిక్, విజనరీ లీడర్: చౌహాన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాభివృద్ధి రోడ్‌మ్యా్‌పను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబును డైనమిక్, విజనరీ లీడర్‌గా అభివర్ణించారు. ఢిల్లీలోని కృషిభవన్‌లో సీఎం ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాలు, సాంకేతికత విషయంలో రాష్ట్రానికి అండగా నిలుస్తామని చౌహాన్ చెప్పారు. ‘జీడిపప్పు, కాఫీ, కోకో, కొబ్బరి రైతులకు మద్దతు ధర దక్కేలా చూస్తాం. మత్స్య, పశుపోషణ అభివృద్థికి సహకారం అందిస్తాం’ అని తెలిపారు. కాగా.. వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా మారుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది దేశ జీడీపీలో ఏపీ వాటా 9.9ు ఉండడం విశేషమన్నారు. ఉద్యాన పంటలు, ఆక్వాకల్చర్, కొబ్బరి, జీడిమామిడి, కాఫీ, కోకో వంటి పంటలకు ఆధునిక సాంకేతికతను జోడించి తర్వాతి స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర మార్గదర్శకత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. 50 లక్షల మంది రైతులతో కలిసి 50 లక్షల ఎకరాలలో ప్రకృతి సేద్యం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.