Share News

అమరావతికి కేంద్రం అండ: మాధవ్‌

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:25 AM

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్నివిధాలా అండగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

అమరావతికి కేంద్రం అండ: మాధవ్‌

అమరావతి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్నివిధాలా అండగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. కేంద్రం ఆర్థికంగా, రాజకీయంగా మద్దతు అందిస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత నుంచి 2018 వరకూ ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో వంటి సంస్థల ద్వారా సుమారు రూ.26 వేల కోట్ల ఆర్థిక సహకారం అందించిందని వివరించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదించిందని మాధవ్‌ పేర్కొన్నారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంలో రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 05:26 AM